షాన్‌వాజ్ రాజీనామాకు డిమాండ్
న్యూఢిల్లీః ఢిల్లీ విమానం హైజాక్ వ్యవహారంలో దేశాన్ని నవ్వులపాలు చేసిన పౌరవిమానయాన శాఖ మంత్రి షాన్‌వాజ్ హుస్సెన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
విమానం హైజాక్ సంఘటనపై ప్రకటన చేసేముందు మంత్రి నిజానిజాలను నిర్ధారించుకోవల్సిందని కాంగ్రెస్ ప్రతినిధి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సంఘటనతో ఇతర దేశాల ముందు భారత్‌తలవంచుకోవల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. మొత్తం వ్యవహారంలో గందరగోళం, తొందరపాటుతో వ్యవహారించిన ప్రభుత్వం ఇప్పుడు తీరిగ్గా దర్యాప్తునకు ఆదేశించడం విడ్డూరంగా వున్నదని జైపాల్‌పేర్కొన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వం అసమర్ధత దేశానికి ప్రధాన ప్రమాదమని జైపాల్ ఆందోళన వెలిబుచ్చారు.












Click it and Unblock the Notifications