ఆరువికెట్లతో భారత్ పరాజయం
జొహెనెస్‌బర్గ్‌ః భారత జట్టు వీరలెవల్లో విజృంభించి ఆడినప్పటికీ అంతకంటే ధాటిగా ఆడిన దక్షిణాఫ్రికా జట్టు ఆరువికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది. సౌరభ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ సెంచరీలతో 279 పరుగుల భారీస్కోర్ సాధించిన భారత జట్టు ఆనందాన్ని తుస్సుమనిపించింది.
ఇక్కడ జరుగుతున్న ముక్కోణపు వన్డేసీరిస్‌లో తొలి మాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికావిజయం సాధించింది. భారత్ తమ ముందుంచిన భారీ లక్ష్యాన్ని అధిగమించడానికి షాన్ పోలాక్ సారథ్యంలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 48 వోవర్లలోనే 280 పరుగులు చేసింది. ఓపెనర్లు గిబ్స్, కిర్‌స్టర్ ఆదినుంచే విరుచుకుపడ్డారు. ఫలితంగా తొలి పదిహేను ఓవర్లలోనే దక్షిణాఫ్రికా స్కోరు 100 దాటింది.
అప్పుడే భారత్‌విజయమై అనుమానాలు ప్రారంభమయ్యాయి. శ్రీనాథ్ బౌలింగ్‌లో గిబ్స్ 45 బంతుల్లో 48 పరుగులు చేసి ఔట్‌అయినప్పటికీ దక్షిణాఫ్రికా దూకుడుకు మాత్రం తగ్గలేదు. గిబ్స్ స్థానంలో వచ్చిన కలిస్ అండగా కిర్‌స్టర్‌సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం మీద నాలుగు కేవలం నాలుగువికెట్ల నష్టానికి 280 పరుగులతో దక్షిణాఫ్రికా విజయపతాక నెగురవేసింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించిన కారణంగా భారత బౌలర్లు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌కు పగ్గాలువేయలేకపోయారు.
గంగూలీ,సచిన్ సెంచరీలు-భారత్ 279/5












Click it and Unblock the Notifications