కోస్తా ఆంధ్రకు వాయుగండం
హైదరాబాద్‌ః బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఆంధ్రరాష్ట్రం అంతటా కుంభవృష్టి కురుస్తున్నది. ఎడతెరిపి లేని వర్షాలతో కోస్తా జిల్లాల గుండెల్లోరైళ్ళు పరిగెత్తుతున్నాయి. వచ్చే 48 గంటల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వాయుగుండం ప్రభావం వల్ల కోస్తా తీరప్రాంతంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులువీస్తాయని అధికారులు వివరించారు.
రాష్ట్రంలో పలు జిల్లాలలో ముసురు వాతావరణం నెలకొంది. రాజధాని హైదరాబాద్ లో శనివారం ఉదయం కుంభవృష్టి కురిసింది. సుమారు రెండు గంటలసేపు భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించి పోయింది. ఆఫీసులకు వెళ్ళే సమయంలో వర్ష రావడంతో పలు చోట్ల ట్రాఫిక్ జాం లు జరిగాయి. వీధులన్నీ జలమయం అయ్యాయి. రోజంతా ముసురుగా వుండడంతో నగరం ముసుగేసింది.
నెల్లూరులో స్తంభించిన జనజీవనం
భారీ వర్షంతో నెల్లూరు తడిసి ముద్దయింది. సముద్రతీర ప్రాంతాల్లో ఈదురు గాలులు వీస్తుండడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తుపాను ఏ క్షణంలో ముంచుకొస్తుందో అనే ఆందోళనసర్వత్రా వ్యక్తం అవుతున్నది.
కర్నూలులో భారీ నష్టం
కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురవడంతో జనజీవనంఅస్తవ్యస్తం అయింది. ఎడతెరిపి లేని వర్షంతో ఉల్లి రైతులువిలవిల లాడి పోతున్నారు. కనీసం కోటి రూపాయల నష్టం జరిగిందని రైతులు వాపోయారు.












Click it and Unblock the Notifications