అమెరికా విమానంపై కాబూల్ కాల్పులు
కాబూల్‌ః ఆఫ్ఘన్ గగనతలంలో తిరుగుతున్న ఓవిమానంపై తాలిబన్లు శనివారం కాల్పులు జరిపారు. అయితే ఆవిమానం బాగా ఎత్తులో వుండడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అది అమెరికాకు చెందినవిమానమేనని అనుమానిస్తున్నారు. అమెరికా ఈ అంశంపై నోరువిప్పలేదు. పాకిస్తాన్ స్థావరంగా అమెరికా యుద్ధవిమానాలు విన్యాసాలు ప్రారంభిచాయని వార్తలు వెలువడుతున్నాయి.
తాలిబన్లు గురిపెట్టినవిమానం అమెరికాకు చెందిన ఎఫ్-18 రకం విమానంగా భావిస్తున్నారు. కాల్పుల శబ్దం వినపడడంతో కాబూల్ ప్రజలు వీధుల్లోకి పరుగులు తీసి ఆకాశం వంక చాలాసేపు చూశారు. అమెరికా గూఢచారి విమానంపై క్షిపణులుపేల్చినట్లు తాలిబన్లు కూడా అంగీకరించారు.












Click it and Unblock the Notifications