కాశ్మీర్ లోనూ నా స్థావరాలుః లాడెన్
ఇస్లామాబాద్‌ః అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్ లాడెన్ కు కాశ్మీర్ లో కూడా స్థావరాలు ఉన్నాయి. ఈవిషయాన్ని బిన్ లాడెన్ స్వయంగా అంగీకరించాడు. తనకు ఇండొనీసియా నుంచి అల్జీరియా వరకు, చెచెన్యా నుంచి కాశ్మీర్ వరకు, బోస్నియా నుంచి సూడాన్ వరకు స్థావరాలు వున్నట్లు పాకిస్తాన్ ఉర్దూ వారపత్రిక తక్ బీర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాడెన్ స్పష్టం చేశాడు.
నేను ఎక్కడైనా తలదాచుకో గలను... ఆఫ్ఘన్ లోనే వుండాలని లేదు.. నేను చావుకు ఎప్పుడూ భయపడను....వీరోచిత మరణం ప్రసాదించమని ఎప్పుడూ అల్లాను ప్రార్థిస్తూ వుంటానని లాడెన్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. లాడెన్ ను ఎక్కడ ఇంటర్వ్యూ చేసిందీ ఆ పత్రిక వెల్లడించలేదు. పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా అడుగులకు మడుగులు ఒత్తుతున్నప్పటికీ అవసరం వస్తే తనకు ఆశ్రయ కల్పిస్తారని లాడెన్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇస్లాం వ్యతిరేకులపై పోరాడే సామర్ధ్యం పాకిస్తాన్ కు బాగా వున్నదని లాడెన్ అన్నాడు. అమెరికాపై జరిపిన దాడులతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని భారత్, రష్యా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన తీవ్రవాదులు ఎవరైనా ఆ దాడికి పాల్పడి వుండవచ్చునని లాడెన్ చెప్పడంవిశేషం.












Click it and Unblock the Notifications