అరబ్ టీవీలోబిన్‌లాడెన్ దర్శనం
దుబాయ్‌ః అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ తన సహచరులతో కలసి వేడుకలు జరుపుకుంటున్న టేప్‌ను ఖతార్‌కు చెందిన అరబ్ టీవీ అల్ జజీరా శుక్రవారం నాడు ప్రసారం చేసింది. లాడెన్‌కు సంబంధించి లభ్యమైన తాజా టేపుగా దీనిని పేర్కొన్నారు.
ఈ టేపులో లాడెన్ ప్రధాన సహచరుడు అల్ జవహారీ అతని పక్కనే వున్నాడు. లాడెన్ సారథ్యంలోని అల్-ఖైదాలో జవహారీకి చెందిన ఈజిప్షియన్‌జిహాద్ గ్రూప్‌ను విలీనం చేసిన సందర్భంగా జరిగిన వేడుకలకు సంబంధించిన టేపుగా దీనిని వెల్లడించారు.
పర్వతాలు, ఎత్తైన శిఖరాలు ఈ టేపులో కనిపించాయి. లాడెన్ సహచరులు ఉత్సాహభరితంగా వున్నప్పటికీ లాడెన్ మాత్రం కొంత నిర్వికారంగా కనిపించాడు. కొన్నిసార్లు కెమరావంక సూటిగా చూసినప్పటికీ మొహంలో మాత్రం నవ్వు కనిపించలేదు. లాడెన్, జవహారీ వెనక ముసుగులు ధరించిన ఎకె 47 ధరించిన తీవ్రవాదులు వున్నారు.












Click it and Unblock the Notifications