ఏడుకోట్ల భూమి ఇంద్రసేనుడి పరం

హైదరాబాద్‌ః బిజెపి శాసనసభా పక్ష నాయకుడు, మలక్‌పేట శాసనసభ్యుడు ఎం. ఇంద్రసేనారెడ్డి భూకుంభకోణంలో చిక్కుకున్నారు.విజయవాడ రోడ్డులో వున్న ఆటోనగర్‌ సమీపంలోని 7 వేల చదరవు గజాల భూమిని అతి తక్కువ ధరకు ఇంద్రసేనారెడ్డి సొంతం చేసుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. మలక్‌పేట మాజీ ఎమ్మెల్ల్యే సుధీర్‌ కుమార్‌, ఎమ్మెల్ల్యే శంకర్రావు శనివారం ఇంద్రసేనారెడ్డి అక్రమంగా సొంతం చేసుకున్న స్థలాన్ని సందర్శించారు. ఆ స్థలం వద్ద ఇంద్రసేనారెడ్డి కుమారుడు కాంగ్రెస్‌ నేతలతో వాగ్వివాదానికి దిగాడు.

సుమారు ఏడు కోట్ల రూపాయలవిలువచేసే భూమిని ఇంద్రసేనా రెడ్డి నామమాత్ర ధర చెల్లించి సొంతం చేసుకున్నారని సుధీర్‌ కుమార్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంద్రసేనారెడ్డికి ఈవిలువైన భూమిని ధారాదత్తం చేశారని ఆరోపించారు. పార్క్‌ కు కేటాయించిన స్థలాన్ని ఇంద్రసేనారెడ్డికి ఎలా ఇస్తారని వారువిమర్శించారు. ఈ స్థలాన్ని వేలం వేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కబ్జా కాదు... కొనుగోలు చేశాః ఇంద్రసేనారెడ్డి
తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకే కాంగ్రెస్‌ నేతలు ఈ విధంగా ఆరోపిస్తున్నారని ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. 1.2 కోట్ల రూపాయల మార్కెట్‌ ధర చెల్లించే ఈ స్థలాన్ని కొనుగోలు చేశానని ఆయన శనివారం చెప్పారు. ఈ ప్రాంతంలో అన్ని స్థలాలను వేలం ద్వారానే కేటాయించారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ వారు పనిలేకే ఇలా ఆరోపణలు చేస్తున్నారని ఆయనవిమర్శించారు.

ఇంద్రసేనారెడ్డి తన భార్య పేరిట పెట్రోల్‌ బంక్‌ కు అనుమతి పొందారు. ఈ స్థలంలోపెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో లాలూచీ పడి తక్కువ ధరకువిలువైన ఈ స్థలాన్ని సొంతం చేసుకున్నారని విమర్శలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+