కల్తీసారాకు 20మంది బలి
చెన్నైః తమిళనాడులో కల్తీసారాతాగి 20 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 30 మంది చెన్నయ్ లోని ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మృతులలో కొందరు మహిళలు కూడా వున్నారు. కల్తీ సారా కాటుకు ఇంత మంది బలి కావడం తమిళనాడులో సంచలనం సృష్టించింది.చెన్నై నగర శివార్లలోని రెడ్‌హిల్స్‌లో ఈ సంఘటన శనివారం నాడు జరిగింది.
కల్తీసారా వాతపడిన వారిని ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రిలో చేర్చారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులుఅయిదుగురు వ్యక్తులను అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గత నెలరోజుల వ్యవధిలో కల్తీసారాకు సంబంధించి ఇది రెండో అతిపెద్దవిషాదం. కల్తీసారా అమ్మిన దుకాణంపై స్థానిక ప్రజలు దాడి చేసి విధ్వంసం జరిపారు.












Click it and Unblock the Notifications