నాలుగేళ్ళలో ఆంధ్రలో సంపూర్ణఅక్షరాస్యత
వరంగల్‌ః నాలుగేళ్ళలో ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ఉద్యమం చేపట్టినట్లు రాష్ట్ర ప్రాధమికవిద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన గ్రామాలు, మండలాలకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నదని శనివారం వరంగల్ జిల్లా తొర్రూరులో జరిగిన కార్యక్రమంలో శ్రీహరి చెప్పారు.
సంపూర్ణ అక్షరాస్యత సాధించిన గ్రామాలకు 2 లక్షలు, మండలాలకు 20 లక్షల వరకు ప్రోత్సాహకాలు ప్రకటించేవిషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదన్నారు. రాష్ట్రంలోఅందరూ చదువుకోవాలనే సంకల్పంతో ప్రారంభించిన ఈ సంపూర్ణ అక్షరాస్యత పధకంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications