రైతు బజార్ల నుంచి డోర్‌డెలివరీ
హైదరాబాద్‌ః రైతుబజార్లను అభివృద్ధి చేసే లక్ష్యంతో త్వరలో పద్ధతిని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రజలు ఇళ్ళ నుంచే ఏ మార్కెట్ లో మంచి సరుకు దొరుకుతుందో తెలుసుకొని, డోర్‌డెలివరీకి ఆర్డర్ చేసే విధానానికి శ్రీకారం చుట్టనున్నట్లు శనివారం జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శిక్షణా కార్యక్రమంలో ఆయన అన్నారు.
చిన్న వర్ష కురిస్తే హైదరాబాద్ వీధులు జలమయం కావడం, ట్రాఫిక్ జాం లు సంభవించడం జరుగుతున్నదని, ఇలా జరగకుండా మురగునీటి పారుదల వ్యవస్థను పటిష్టం చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. త్వరలో జరిగే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసేందుకు హైదరాబాద్ కు చెందిన ఏడు నియోజక వర్గాల కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇకమీదట నామినేటెడ్ పదవులను రొటేషన్ పద్ధతిలో కష్టించి పనిచేసే వారికి ఇవ్వాలని సంకల్పించనట్లు చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications