పాక్‌ను పక్కనబెడితే ఎలా?
న్యూఢిల్లీః అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఎక్కుపెట్టిన పోరాటంలో పాకిస్తాన్‌ను పక్కనపెట్టడం ఏ మాత్రం సమర్ధనీయం కాదని భారత్ స్పష్టం చేసింది. టెర్రరిజానికి సంబంధించి పాకిస్తాన్ సమస్యలో భాగమే తప్ప పరిష్కారంలో భాగం కాదని ప్రధాని వాజ్‌పేయి పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై అమెరికా ఎక్కుపెట్టిన దాడికి మద్దతు కూడగట్టే కార్యక్రమంలో భాగంగా భారత్‌కు వచ్చినబ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో కలిసి పాల్గొన్నవిలేకరుల సమావేశంలో ప్రధాని ఈ విషయం వెల్లడించారు. టెర్రరిజానికి ప్రపంచంలో ఎక్కడా నిలువనీడ లేకుండా చేయాలని ఆయన అన్నారు. అప్పుడు టెర్రరిజంపై ప్రపంచదేశాల పోరు అర్ధవంతంగా వుంటుందని చెప్పారు. ఏ ఒక్క చోట పునాది వున్న మరో చోట ఉగ్రవాదం తలెత్తడం ఖాయమని ఆయన చెప్పారు. కాగాబ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ మాత్రం పాకిస్తాన్‌పేరు నేరుగా ఎత్తకుండా ఆచితూచి మాట్లాడారు. టెర్రరిజంపై పోరులో భారత్ వైఖరిని ప్రశంసించారు.
ప్రస్తుతం న్యూయార్క్‌పై దాడికికారకులైన వారిని తుదముట్టించడంపైనే దృష్టిని నిలిపినట్టుగా ఆయన వెల్లడించారు. బ్లెయిర్ శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం ఉదయం ఆయన్ను హోం మంత్రి అద్వానీ, విదేశాంగ మంత్రి జస్వంత్‌సింగ్ కూడా కలిసారు. పాకిస్తాన్‌విషయంలో భారత్ అభిప్రాయాలను జస్వంత్ సింగ్ కుండబద్దలు కొట్టినట్టుగా బ్లెయిర్‌కు వెల్లడించారు. ఉపఖండంలో ఉగ్రవాదానికి ఊపిరులు ఊదుతున్నది పాకిస్తానేననిఆయన చెప్పారు. టెర్రరిజం ఏ రూపంలో వున్న ఒక్కటేనని దాని అంతుచూడాల్సిందేనని జస్వంత్ అన్నారు. ఆమోదయోగ్యమైన టెర్రరిజం, అమోదయోగ్యం కాని టెర్రరిజంఅంటూ రెండు వేరువేరుగా వుండవని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications