అమెరికా సేనల కదం

ఇస్లామాబాద్‌ః అమెరికా సేనలు కదం తొక్కుతూ ముందుకు చొచ్చుకుపోతున్నాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఉజ్బెకిస్తాన్‌లో అమెరికా పదాతి దళాలు దిగినట్టుగా సమాచారం అందింది.

ముందుగాఅఎn్గాన్‌పై దాడికి తమ భూభాగాన్ని కేంద్రంగా చేసుకోవడానికి తిరస్కరించిన ఉజ్బెకిస్తాన్‌ ఆ తర్వాత తమ వైమానిక స్థావరాలను ఉపయోగించుకోవడానికి అనుమతినిచ్చింది. ఉజ్బెకిస్తాన్‌లో అడుగుపెట్టిన అమెరికాసేనలు అక్కడినుంచి అఎn్గాన్‌ దిశగా కదులుతున్నట్టుగా తెలిసింది. మరోవైపు రష్యా, అమెరికాలకు చెందిన కమెండో బలగాలు ఇప్పటికేఅఎn్గానిస్తాన్‌లో లాడెన్‌ దాక్కున్న కొండల వైపుగా సాగుతున్నాయి. పాకిస్తాన్‌ గగనతలంపై అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్‌-18 యుద్ధవిమానాలు చక్కర్లు కొట్టుతుండటంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా యుద్ధం ఆరంభమైన వాతవరణం కనిపిస్తున్నది.

అఎn్గాన్‌పై దాడికిఅరబ్‌ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా వివిధఅరబ్బు దేశాలను సందర్శిస్తున్న అమెరికా రక్షణ మంత్రికి ఉజ్బెకిస్తాన్‌తో పాటు టర్కీ, ఈజిప్ట్‌ దేశాల మద్దతు లభించింది. ఉజ్బెకిస్తాన్‌ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించనప్పటికీ టర్కీ మాత్రం అమెరికాకు అండగా నిలుస్తామని వెల్లడించింది. గడువుదగ్గరపడినట్టుగా అమెరికా అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ చివరి సారిగా శనివారం నాడు మరోసారి తాలిబన్లను హెచ్చరించారు. బుద్ధి మార్చుకుని లాడెన్‌నుఅప్పగిస్తే మంచిదని లేదంటే తాలిబన్లు తగిన మూల్యం చెల్లించాల్సివస్తుందని ఆయన హెచ్చరించారు. 24 గంటల్లో తాలిబన్లపై దాడులు ప్రారంభం కావడం ఖాయమనిఅంటున్నారు. యుద్ధం స్థాయిలో జరుగుతుందా లేక కమెండో ఆపరేషన్‌ ద్వారా తాలిబన్‌ ప్రభుత్వాన్ని కూల్చివేస్తారా అన్నదే ఇప్పుడు ముఖ్యప్రశ్న.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+