ఇటలీలో విమానాలు డీ-115మంది మృతి
మిలన్‌ః ఇటలీలోని మిలన్ విమానాశ్రయంలో సోమవారం మధ్యాహ్నం రెండు విమానాలు డీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో కనీసం 115 మంది దుర్మరణం పాలయ్యారు. ఇటలీకి చెందిన విమానం ఒకటి మిలన్ విమానాశ్రయంలో దిగే సందర్భంగా అక్కడ నిలిపి వున్న జర్మనీకి చెందిన చిన్న జెట్ విమానాన్ని డీ కొనడంతో రెండు విమానాలు పేలిపోయాయి.
ఈ దుర్ఘటనలో ఇటలీవిమానంలోని 110 మంది, జర్మనీ జెట్ లోని నలుగురు మరణించి వుంటారనిఅంచనా వేస్తున్నారు.
ప్రమాదం జరిగిన మూడు గంటల తరువాత 60 మృత దేహాలను వెలికి తీశారు. రెండువిమానాలు పేలిపోవడంతో సమీపంలో వున్న గొడౌన్ కూడాపేలిపోయింది. విమానాశ్రయంలో దట్టంగా మంచు వుండడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందనిభావిస్తున్నారు.












Click it and Unblock the Notifications