ఆంధ్ర రాష్ట్రం అప్రమత్తం
హైదరాబాద్‌ః ఆఫ్ఘన్ పై అమెరికా కూటమి దాడులు ప్రారంభించడంతో ఆంధ్రప్రదేశ్ లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.విమానాశ్రయాలు, ఆసెంబ్లీ, సచివాలయం, దేవాలయాలు, ప్రభుత్వ కట్టడాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. 175 ప్రాంతాలను సున్నితమైనవిగా గుర్తుంచి వాటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి దేవేందర్ గౌడ్ సోమవారం నాడు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసు యంత్రాంగం ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించరాదని ఆయన పోలీసులను ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ తగు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులనుకోరారు. ముందు జాగ్రత్త చర్యగా ఇక మీదట ప్రభుత్వ వాహనాలపై వుండే జాతీయ పతాకాన్ని తీసివేయాలని ఆలోచిస్తున్నట్లు దేవేందర్ గౌడ్ చెప్పారు. యుద్ధ ప్రభావం నేరుగా వుండనప్పటికీ ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయనవివరించారు. రాష్ట్ర రాజధానిలో పోలీసులు అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications