అంతం కాదిది ఆరంభంః అమెరికా
వాషింగ్టన్‌ః ఉగ్రవాద నిర్మూలనకు ఆదివారం ప్రారంభమైన యుద్ధం కేవలం ఆరంభం మాత్రమేనని అమెరికా ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వాన్ని కూల్చి ఆ దేశంలో సమర్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు ఈ యుద్ధం ఆగదని ఆమెరికా అధికారులు స్పష్టం చేశారు.
ఆఫ్ఘనిస్తాన్‌సేనలు చెప్పుకుంటున్న విధంగా అమెరికా విమానానికి నష్టం జరగలేదనిపెంటగాన్ వర్గాలు వెల్లడించాయి. తాము ఉగ్రవాదానికి మాత్రమే వ్యతిరేకమని, ఆఫ్ఘన్ పై తమకు ఎటువంటి వ్యతిరేకత లేదని అమెరికా మరోమారు స్పష్టం చేసింది. ఈ దాడులు కొద్ది రోజుల పాటు కొనసాగుతాయని కూడా అమెరికా చెప్పింది. కేవలంసైనిక స్థావరాలపైనే క్షిపణులు గురిపెడుతున్నామనిపెంటగాన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
మరిన్ని దేశాలపై దాడులు
ఉగ్రవాదంపై ప్రారంభించిన ఈ యుద్ధం ఆఫ్ఘనిస్తాన్ తో ఆగదని, మరిన్ని దేశాలపై దాడులు జరిపే అవకాశాలున్నాయని అమెికా వెల్లడించింది. ఈవిషయాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి అమెరికా తెలియజేసింది. ఆఫ్ఘన్ లో కనీసం 30 స్థావరాలను ధ్వసం చేసినట్లు అమెరికా రక్షణ మంత్రి వెల్లడించారు. మాసేనలు మళ్ళీ దాడులకుసిద్ధం అవుతున్నట్లు రమ్స్‌ఫీల్డ్ వెల్లడించారు.
బ్రిటన్ వార్ క్యాబినెట్
మరోవైపు యుద్ధోత్సాహంతో వున్నబ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ వార్ క్యాబినెట్ ఏర్పాటు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ పై అనుకున్న విధంగానే దాడులు నిర్వహించగలిగామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications