ఆఫ్ఘన్ పై అమెరికా తాజా దాడులు
వాషింగ్టన్‌ః ఆఫ్ఘనిస్థాన్ పై అమెరికా రెండో విడత దాడులకు దిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9.40 గంటలకు ఆఫ్ఘనిస్తాన్ పై రెండో విడత దాడులు ప్రారంభించినట్లుపెంటగాన్ వర్గాలు ధృవీకరించాయి. ఆదివారం రాత్రి ఖచ్చితంగా ఇదే సమయంలో యుధ్ధానికిశ్రీకారం చుట్టిన అమెరికా వెంటనే సోమవారం నాడే రెండో విడత దాడులకు దిగడంవిశేషం. .
రాత్రిళ్ళే కాకుండా పగటి పూట కూడా దాడులు చేస్తామని చెప్పినప్పటికీ సుమారు 20 గంటల పాటు మౌనంగా వున్న అమెరికా యుద్ధవిమానాలు సోమవారం రాత్రి మళ్ళీ గర్జిస్తున్నాయి. ఆదివారం జరిగిన దాడితో నిర్ఘాంతపోయిన ఆఫ్ఘన్ పౌరులు ఏ మాత్రం తేరుకోకముందే అమెరికా రెండోదెబ్బ కొట్టింది.












Click it and Unblock the Notifications