మాటవిననందుకే ఈ యుద్ధం

వాషింగ్టన్‌ః అఎn్గాన్‌లోని తాలిబన్‌ పాలకులు చెప్పినట్టుగా విననందుకే వారికీశాస్తి జరుగుతున్నదని అమెరికా అధ్యక్షుడు జార్జ్‌బుష్‌ వెల్లడించారు. అమెరికన్‌ బలగాలు అఎn్గాన్‌పై విరుచుకుపడిన కొద్ది సేపటికే ఆయన అమెరికా ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
.

తన ఆదేశాల మేరకేఅఎn్గాన్‌పై దాడులు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. అల్‌ ఖైదా ఉగ్రవాదుల శిబిరాలపైనా,సైనిక స్థావరాలపైనా మాత్రమే దాడులు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.బ్రిటన్‌ ఈ దాడుల్లో తమకు అండగా వున్నదని యావత్‌ ప్రపంచం తమకు సంఘీభావం ప్రకటించిందని బుష్‌ ప్రకటించారు. తాలిబన్ల ముందు అమెరికా నిర్ధష్టమైన, స్పష్టమైన ప్రతిపాదనలను ఉంచిందని కానీ తాలిబన్లు వాటిని నెరవేర్చలేదని ఆయన చెప్పారు.

అఎn్గానిస్తాన్‌ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంనువిశ్వసించే వందలకోట్ల మంది ప్రజలు అమెరికాకు మిత్రులేనని ఆయన చెప్పారు. అమాయకులను హత్యచేసే నేరగాళ్లు మాత్రమే తమ శత్రువులని స్పష్టం చేశారు. ఈ అనాగరిక, మానవమృగాలపైనే తమ దాడులని ఆయనవిస్పష్టంగా వెల్లడించారు. ఉగ్రవాదంపై అమెరికా ఎక్కుపెట్టిన యుద్ధంలో ఇప్పుడు ఎవ్వరూ తటస్థంగా వుండటానికివీలులేదని ఆయన పేర్కొన్నారు.

దేవుని అనుగ్రహం,ఆశీస్సులు అమెరికాకు సంపూర్ణంగా వున్నాయని చెప్పారు. యావత్‌ ప్రపంచంఏకమై అమెరికాకు అండగా నిలిచిన ఈ యుద్ధంలోవిజయం సాధించేవరకు అమెరికా విశ్రమించదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను సహనంతో ఎదుర్కోవడానికి అమెరికా ప్రజలు సిద్ధంగా వుండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదిలాదాడుల ప్రారంభానికి ముందుగా రష్యా నేత ఫుతిన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడుషిరాక్‌, భారత ప్రధాని వాజ్‌పేయితో బుష్‌ ఫోన్‌లో మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+