దాడుల్లో అమాయకుల ఆహుతి
ఇస్లామాబాద్‌ః పౌరఆవాస ప్రాంతాలపై దాడులు జరపలేదని దాడులు జరిగిన ప్రాంతాలన్నీ సైనిక, ఉగ్రవాద కేంద్రాలని అమెరికా ప్రకటించినప్పటికీ ఆదివారం రాత్రి అమెరికా జరిపిన దాడుల్లో కనీసం 20 మంది అమాయక పౌరులు మరణించినట్టుగా అఎn్గానిస్తాన్ ఇస్లామిక్ ప్రెస్ ప్రకటించింది.
.
కాబూల్ ఎయిర్ పోర్టు సమీపంలో పదిమంది, రేడియేస్టేషన్ సమీపంలో మరోపది మంది అమెరికా విమానాల బాంబుల వర్షంతో మరణించినట్టుగా తమకు సమాచారంఅందిందని ఈ సంస్థ తెలిపింది. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే వుండే అవకాశం వున్నదనిపేర్కొన్నది. ఇదిలా వుండగా అమెరికా దాడుల్లో మరణించిన వారి సంఖ్య కాబూల్‌లో చాలా ఎక్కువగా వున్నట్టు అనధికార వార్తా సంస్థలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications