భారత్, ఇయు మద్దతు
న్యూఢిల్లీః అఎn్గానిస్తాన్‌పై అమెరికా దాడులను భారత్ గట్టిగా సమర్ధించింది. తాము మొదటి నుంచి టెర్రరిజంపై అమెరికా ఎక్కుపెట్టిన యుద్ధానికి మద్దతునిస్తున్నామని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఒమర్ అబ్లుల్లా చెప్పారు. అఎn్గానిస్తాన్‌లో విస్తృత ప్రాతినిధ్యం గల ప్రజాప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం వున్నదని ఆయన చెప్పారు. దాడులు ఇస్లాంపై కాదని కేవలం కొందరు ఉగ్రవాదులు, ఉన్మాదులపై మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. కాగా అమెరికాకు మొదటినుంచి బాసటగా వున్న యూరోపియన్ దేశాలు కూడా దాడులను గట్టిగా సమర్ధించాయి.
.
దాడుల్లో తామూ పాల్గొన్నట్టుగాబ్రిటన్ ప్రకటించింది. జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా కూడా దాడుల్లో భాగం పంచుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి.అఎn్గాన్‌పై దాడిని సాహసోపేతమైన చర్యగా ఇజ్రాయెల్ ప్రకటించింది. అమెరికన్ ప్రజలు, అధ్యక్షుని క్షేమం కోసం తాము దేవున్ని ప్రార్ధిస్తున్నామని ఇజ్రాయెల్ నేత షిమోన్ పిరాజ్ తెలిపారు. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికాకు బద్ద శత్రువుగా వున్న రష్యా కూడా ఈ దాడులను గట్టిగా సమర్థించింది. ఉగ్రవాదానికి శిక్షపడాల్సిందేనని రష్యానేత ఫుతిన్ అన్నారు.












Click it and Unblock the Notifications