భయంతో ఆఫ్ఘన్ పౌరుల పలాయనం
కాబూల్‌ః అమెరికాసేనలు పౌర ప్రాంతాలపై క్షిపణులు ఎక్కుపెట్టకపోవడం పట్ల ఆఫ్ఘన్ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అయితే మరిన్ని దాడులు జరగవచ్చుననే భయంతో ప్రజలు ప్రాణాలుఅరచేత పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు పారిపోతున్నారు.
అమెరికా దాడుల్లో భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. కాబూల్ పలు భవనాలు ధ్వసం అయ్యాయి. అయితే జరిగిన నష్టంపై తాలిబన్లుపెదవి విప్పడం లేదు. కాబూల్, కాంధహార్లలోసైన్యం కవాతులు జరుగుతున్నాయి. అమెరికా ప్రతీకారం తీర్చుకుంటామని ఆఫ్ఘన్ యువత రణనినాదాలు చేస్తున్నది.
ఆదివారం రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు రెండు సార్లుగా ఆఫ్ఘన్ పైమిసైళ్ళు, శతఘ్నుల వర్షం కురిపించిన అమెరికా పగటి పూట కూడా దాడులు జరుపుతామని ప్రకటించింది. రెండో విడత దాడులకు అమెరికా సిద్ధం కావడంతో ఆఫ్ఘన్ పౌరుల గుండెల్లోరైళ్ళు పరిగెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications