బుష్ ఫోన్‌ఃభారత్ అప్రమత్తం
న్యూఢిల్లీః అఎn్గానిస్తాన్‌పై దాడులు ప్రారంభిస్తున్న విషయం అమెరికా అధ్యక్షుడు జార్జ్‌బుష్ భారత ప్రధాని వాజ్‌పేయికి ముందుగానే ఫోన్ చేసి చెప్పారు. ఈ సందర్భంగా కాశ్మీరీ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ను నిషేధిస్తామని కూడా ఆయన ప్రధాని వాజ్‌పేయికి హామీ ఇచ్చారు.
.
అమెరికాలో భారతీయులు, సిక్కులపై జరుగుతున్న దాడులపై సమగ్రవిచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అమెరికా విదేశాంగ మంత్రి కొలిన్ పావెల్ త్వరలో భారత్ పర్యటించనున్నట్టుగా కూడా బుష్ వెల్లడించారు. బుష్ చర్యలకు ప్రధాని వాజ్‌పేయి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలా వుండగా బుష్ ఫోన్ వచ్చిన వెంటనే ప్రధాని హుటాహుటీన మంత్రివర్గం అత్యవస సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
హోం మంత్రి అద్వానీ, రక్షణ, విదేశాంగ మంత్రి జస్వంత్‌సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.అఎn్గానిస్తాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో సైన్యాన్ని అప్రమత్తంగా వుండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. త్రివిధ దళాలను అప్రమత్తం చేయడంతోపాటు కాశ్మీర్‌లోకి ఉగ్రవాద మూకలు చొచ్చుకురాకుండా భారీ ఎత్తున నిఘాపెంచాల్సిందిగా ఆదేశించారు. ఇస్లాం తీవ్రవాదుల ప్రాభల్యం వున్నట్టుగా భావిస్తున్న హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా భద్రతా దళాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.












Click it and Unblock the Notifications