భారత్ కు నష్టం-పాక్ కు లాభం
న్యూఢిల్లీ:యుద్దం రానే వచ్చింది. ఈ యుద్దంతో భారత్‌కు ప్రత్యక్ష సంబంధం లేదు. కానీ యుద్దంభారత్ కు కూడా కీలకం. వార్ సృష్టించే మారణహోమంపక్కనపెడితే, రాజకీయ లాభం కోసం అందరూపాకులాడుతున్నారు. ముఖ్యంగా భారత్, పాక్, ఇజ్రాయిల్‌లు. కానీ ఇందులో భారత్ కు ఒరిగేదేమీ కనిపించడంలేదు. పాకిస్థానే కీలకమని అమెరికా బహిరంగంగాప్రకటించింది.
.
Coalition againstterror, enduring freedomఅంటూనే కాశ్మీర్ టెర్రరిజం ఇప్పుడు టెర్రర్ కాదంటోంది.మొన్న శ్రీనగర్ అసెంబ్లీ ముందు బాంబు పేలుడుగురించి కూడా పెద్దగా పట్టించుకోలేదు. బాంబుపేలుడుఅదనుగా తీసుకొని భారత్ పాక్ మీద యుద్దం ప్రకటించాల్సిందనిమరికొందరి వాదన. భారత్ మాత్రం అమెరికాజైష్-ఎ-మహ్మద్(పేల్చింది తామేనని ప్రకటించినటెర్రరిస్ట్ సంస్థ)ను బ్లాక్ లిస్ట్ లో పెడుతుందనిఆశపడింది. తీరా మరో వారం పావెల్ ఇండియాకువస్తాడు, అప్పుడు దాని గురించి ఆలోచిస్తామని బుష్‌నిన్న రాత్రి ప్రకటించారు. ఏరకంగాచూసినా ఈ యుద్దం వల్ల భారత్ కు రాజకీయంగాలాభం వచ్చే అవకాశం లేదు. ఐనా భారత్‌సంపూర్ణ మద్దతు ప్రకటించింది.












Click it and Unblock the Notifications