ఇరాన్, ఇరాక్ ఖండన
బాగ్దాద్‌ః అఎn్గానిస్తాన్‌పై అమెరికా ప్రారంభించిన దాడులపై ఇస్లాం రాజ్యాల్లో భిన్న ప్రతిస్పందన వ్యక్తమవుతున్నది. ప్రధాన ముస్లీం రాజ్యాలు ఇరాన్, ఇరాక్ ఈ దాడులను తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి అమెరికా ఈ దాడులకు పాల్పడిందని ఇరాక్ అధ్యక్షుడు సద్దామ్ హుస్సెన్ దుయ్యబట్టారు.
.
అమెరికా ముస్లీం ప్రజలపై దాడులు జరిపినందుకు తాము ఖండించడం లేదని అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి దురాక్రమణకు పాల్పడినందుకు తాము ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. అమెరికా చర్యలు ప్రపంచంలో మరింత అస్థిరత సృష్టించడం ఖాయమని ఆయన హెచ్చరించారు. దురాక్రమణదారులు తమ దురాక్రమణ విధానాలకుస్వస్తి చెప్పి పాలస్తీనా, ఇరాక్ వంటి దేశాలకు న్యాయం జరపడానకిఅంగీకరిస్తారో అప్పుడే ప్రపంచశాంతి సాధ్యం అవుతుందని ఆయనపేర్కొన్నారు.
ఇరాన్ కూడా ఈ దాడులను ఖండించింది. ఈ దాడులు ఎంత మాత్ర ఆమోదయోగ్యం కావని ఇరాన్‌పేర్కొంది. ప్రపంచదేశాల ముఖ్యంగా ఇస్లాం దేశాల అభిప్రాయాలను ఖాతరు చేయకుండా జరిపిన ఈ దాడుల వల్ల అమాయకఅఎn్గాన్ పౌరులు బలిఅవుతున్నారని ఇరాన్ వార్తాసంస్థ ఇర్నాపేర్కొంది. ఈ దాడుల సందర్భంగా ఇరాన్ భౌగోళిక, గగనతల సమగ్రతకు భంగం వాటిల్లితే సహించేది లేదని కూడా ఇరాన్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications