ఒమర్, లాడెన్‌జిహాద్ పిలుపు
కాబూల్‌ః అఎn్గాన్‌పై అమెరికా ఎక్కుపెట్టిన దాడిపై తాలిబన్ల నేత ముల్లా ఉమర్, అంతర్జాతీయ ఉగ్రవాదుల సారథి ఒసామాబిన్‌లాడెన్ నిప్పులు చెరిగారు. అఎn్గానిస్తాన్‌లో ఒక కొండగుహలో లాడెన్ ఇచ్చిన ఇంటర్వ్యూను అల్ జజీరా అరబ్ టీవీ ఛానెల్ ప్రసారం చేసింది.
.
ముస్లీంల నెత్తుటితో ఆడుకుంటున్న అమెరికాకు బుద్ధి చెప్పడానికి అల్లా కొందరు ముస్లీంలకు దారి చూపించారని లాడెన్‌పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ముస్లీంలో పవిత్రస్థలంలో ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు బీభత్సం సృష్టిస్తున్నాయని, అమెరికాలో వేలాది మంది పసి ప్రాణాలను అమెరికా బలితీసుకున్నదని లాడెన్ దుయ్యబట్టారు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలు అవమానాలను భరిస్తూబతుకుతున్నారని, తమ పవిత్ర స్థలాలపై అకారణంగా దాడులు చేస్తూ తమను క్షోభపెడుతున్నారని లాడెన్‌పేర్కొన్నారు.
ప్రపంచ ముస్లీం ప్రజలు ప్రశాంతంగా బతికే రోజు వచ్చే వరకు అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తామని ఆయన ప్రకటించారు. వరల్డ్ ట్రేడ్‌సెంటర్, పెంటగాన్‌లపై దాడుల తర్వాత అమెరికా ఉత్తరం నుంచి దక్షిణం వరకు అనుక్షణం భయంతో వణికిపోతున్నదని ఆయన ఎద్దేవ చేశారు. ఈ దాడులకు తానే కారణమని ప్రకటించనప్పటికీ దాడులను మాత్రం గట్టిగా సమర్ధించాడు.
ఇదిలావుండగా వేరొక ప్రకటనలో అమెరికాపైజిహాద్ ప్రారంభించాల్సిందిగా తాలిబన్ల నేత ముల్లా ఉమర్ ప్రపంచవ్యాప్తంగా వున్న ముస్లీంలకు పిలుపునిచ్చారు.అఎn్గాన్‌పై అమెరికా దాడులు ప్రారంభిస్తే వెంటనే అమెరికాకు వ్యతిరేకంగాజిహాద్ ప్రారంభించాలని గతనెలలో జరిగిన ఉలేమాల సమావేశం తీర్మానించినవిషయం ప్రస్తావిస్తూ తక్షణమే ఈ తీర్మానాన్ని అమలు చేయాలని ముస్లీంలను ఆయనకోరారు.












Click it and Unblock the Notifications