భారత్ పై ముషారఫ్ ప్రేలాపన!
ఇస్లామాబాద్‌ః ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా దాడులు ప్రారంభించిన వెంటనే పాకిస్తాన్ అధ్యక్షుడ్ జనరల్‌పర్వేజ్ ముషారఫ్ భారత్ పై నిందారోపణలకు దిగారు. ఈ పరిస్థితిని సాకుగా తీసుకొని లభ్ది పొందాలనే భారత్ కలలు కల్లలవుతాయని ఆయన సోమవారం ఉదయం జరిగినవిలేకరుల సమావేశంలో ముషారఫ్ స్పష్టం చేశారు. ఆక్రమిత కాశ్మీర్ లోని పాక్‌సైనిక స్థావరాలపై భారత్ దాడులు చేసే అవకాశం వుందా అనివిలేకరులు ప్రశ్నించగా.... భారత్ ఆశలు అడియాశలే అవుతాయి..అయినా సరిహద్దులను కాపాడుకోవడం ఎలాగో పాక్ కు బాగా తెలుసునని ముషారఫ్ అన్నారు..
కాశ్మీర్ లో జరుగుతున్నది తీవ్రవాదం కానే కాదని, అది కాశ్మీర్‌విమోచన కోసం జరుగుతున్న స్వాతంత్ర్య పోరాటం అని ముషారఫ్‌వివరించారు. కాశ్మీర్ ను పాలస్తీనాతో ముడిపెట్టడం భారత్‌అవివేకమని ఆయన అన్నారు.
ఆఫ్ఘన్ పై అమెరికా దాడులను ఆయన సమర్థించారు. ఆ దేశంలో తాలిబన్ ప్రభుత్వం పడిపోగానే నార్తరన్ అలయెన్స్ అధికారంలోకి రాకూడదనేది పాక్ అభిమతమని ఆయన చెప్పారు. నార్తరన్ అలయెన్స్ అధికారంలోకి వస్తే ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీఅరాచకం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. అమెరికాకు మద్దతు పలికిస్వదేశంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ముషారఫ్ యుద్ధం ప్రారంభం కాగానే భారత్ పైవిమర్శలకు దిగడం కేవలం పరువు కాపాడుకోవడానికే అనేవిమర్శలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications