పాక్‌లో యునిసెఫ్‌ కార్యాలయం ధ్వంసం

క్వెట్టాః పాకిస్తాన్‌ లో లాడెన్‌ మద్దతు దారులు సోమవారం నాడుపెను విధ్వంసం సృష్టించారు. పాకిస్తాన్‌ పశ్చిమ ప్రాంతంలో వున్నక్వెట్టాలో వున్న యునిసెఫ్‌ కార్యాలయాన్ని లాడెన్‌ మద్దతుదారులైన పాకిస్తానీలు ధ్వంసం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌ పై అమెరికా జరిపిన దాడులకు నిరసనగా పాకిస్తాన్‌ లో మతఛాందస వాదులుపెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు..పది నుంచి 15 వేల మంది ప్రదర్శన కారులు మూడు సినిమాహాళ్ళు, దుకాణాలు, ఓ పోలీస్టేషన్‌ ను కూడా తగలబెట్టారు. ప్రదర్శనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఈ సందర్భంగాపెద్ద సంఖ్యలో ప్రదర్శన కారులు గాయపడ్డారు.క్వెట్టా, పెషావర్‌ తో పాటు పాకిస్తాన్‌ లోని పలు నగరాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. వేలాది మంది వీధుల్లోకి వచ్చి అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. పాకిస్తాన్‌ అంతటా అమెరికాపైన, ముఖ్యంగా ముషారఫ్‌పైన వ్యతిరేకత పెల్లుబుకుతున్నది.

మిలటరీలో ముషారఫ్‌ మార్పులు
పాకిస్తాన్‌మిలటరీలో ముషారఫ్‌ పెను మార్పులు చేపట్టారు. తాలిబన్ల పట్ల సానుభూతి వున్న సైనికాధికారులకు ఆయన ఉద్వాసన పలికారు. మరో ఇద్దరు సైనికాధికారులను డిమోట్‌ చేశారు. అమెరికా జరిపిన దాడిలో పాక్‌ బేస్‌ లను ఉపయోగించుకోలేదని, తప్పిదాలు చేసిన ఆఫ్ఘన్‌ ను శిక్షిస్తున్నారే కానీ ఇది ఇస్లాంపై జరిగిన దాడిని ముషారఫ్‌ పాక్‌ ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నాలు చేశారు. మొత్తంమీద ముషారఫ్‌ తాజా పరిణామాలతో పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో పడినట్లు కనిపిస్తున్నది.

తాలిబన్లకు అనుకూలంగా వుండే సైనికాధికారులు దేశాధినేత ముషారఫ్‌ రాత్రికి రాత్రే పక్కకు తప్పించారు. సైన్యాధిపతిగా తన కాలపరిమితిని పొడగించుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో ఇదే అత్యంత శక్తిమంతమైన పదవి కావడంతో ఈ పదవిని కూడా ఆయన అట్టేపెట్టుకున్నారు. తాలిబన్లకు సన్నిహితుడైన ఐఎస్‌ఐ అధినేత జనరల్‌ మహమ్మద్‌ అహ్మద్‌ను పదవినుంచి తప్పించారు. ఆయన స్థానంలో తనకు అనుకూలుడైన ఉదారవాదిలెఫ్ట్‌నెంట జనరల్‌ ఎష్నల్‌ హక్‌ను నియమించారు. జనరల్‌ మహమ్మద్‌ అహ్మద్‌ గతనెలలో పాకిస్తాన్‌ తరఫున తాలిబన్లతో దౌత్యం నెరిపినప్పటికీ ఆయన నిఖార్సైన తాలిబన్‌ భక్తుడు. తాలిబన్ల గురించి, లాడెన్‌ గురించి అమెరికన్‌ ఇంటలీజెన్స్‌కు సమాచారం ఇవ్వడానికి నేరుగానే నిరాకరించిన ఘనుడు.సైనికదళాల డిప్యూటీ చీఫ్‌ లెఫ్ట్‌ జనరల్‌ ముజఫర్‌ ఉసామిని కూడా తప్పించారు. వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా వున్నలెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ మహమ్మద్‌ అజీజ్‌ఖాన్‌ను సైనికదళాల చీఫ్‌ఆఫ్‌ స్టాప్‌ పదవిలో కూచోపెట్టారు.

ఈ కొత్తపదివి కేవలం అలంకారప్రాయమైందే కావడం వల్ల ఎలాంటి కీలక నిర్ణయాలను తీసుకునేవీలులేదు. ముషారఫ్‌ సైనిక తిరుగుబాటులో ఈ ముగ్గురు సైనికాధికారులే కీలకపాత్ర వహించినవిషయం ఈ సందర్భంగా గమనార్హం. సైన్యంలో మార్పులతో పాటు తాలిబన్లకు అనుకూలంగా ప్రజలను రెచ్చగొడుతున్న జమియాత్‌-ఇ-ఉలేమా-ఇ- ఇస్లామీ పార్టీ నేత మౌలానా ఫజల్‌ ఉర్‌ రహ్మాన్‌ను గృహనిర్భందంలో వుంచారు. ప్రభుత్వం చర్యలకు నిరసనగా,అఎn్గాన్‌పై దాడులను ఖండిస్తూ ఇస్లామాబాద్‌, కరాచీ, రావల్పిండి, సింధ్‌ హైదరాబాద్‌ వంటి నగరాల్లోపెద్దఎత్తున ప్రజలు ప్రదర్శనలు జరుపుతున్నారు. పాకిస్తాన్‌లోని పలు నగరాల్లో వాతావరణం ఉద్రిక్తంగా తయారయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+