వర్షాలతో తల్లిడిల్లిన తెలుగునేల
హైదరాబాద్‌ః నాలుగు రోజులుగా రాష్ట్రమంతటా కురుస్తున్న భారీ వర్షాలుపెను బీభత్సాన్ని సృష్టించాయి. ఈ వర్షాల కారణంగా కనీసం 75 కోట్లు రూపాయల నష్టం జరిగిందని ప్రభుత్వంఅంచనా వేసింది. 36 మంది వర్షాల కారణంగా మరణించారు..
వీరందరికీ ఆపద్బంధు పథకం కింద సహాయంఅందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారీ వర్షాలు కర్నూలు, అనంతపురం, ఉభయ గోదావరి జిల్లాలు, కడప తదితర ఏడు జిల్లాలలో విధ్వంసం సృష్టించాయి.
ఎడతెరిపిలేని వర్షాల కారణంగా 13,214 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కనీసం 500 రోడ్లుదెబ్బ తిన్నాయి. వేలాది ఎకరాలలో పంట నీట మునిగింది. పలు ప్రాంతాలలో రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కోస్తా ప్రాంతం ఇంకా వాయుగుండం ప్రభావంలోనే వుంది. హైదరాబాద్ నగరంలో ఆదివారం నాడు భారీ వర్షం కురిసింది. సోమవారం నాడు చిరు జల్లులు పడ్డాయి. ముసురు కమ్ముకొని వుంది.
వర్షాల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపుశ్రీశైలం, సింగూరు తదితర జలాశయాలలో భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది.












Click it and Unblock the Notifications