మరో హిట్ బొమ్మ వచ్చేసింది.. గూస్‌బంప్స్ తెప్పించే విజువల్ వండర్

హిందూ సనాతన ధర్మం, భక్తి, మైథాలజీ అంశాల నేపథ్యంతో సరికొత్త లోకంలోకి తీసుకెళ్లే విజువల్ వండర్ "నాగబంధం". ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి, 1960ల నాటి బ్యాక్‌డ్రాప్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో, విజువల్ గ్రాండియర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సనాతన ధర్మ పరిరక్షణ, దేశభక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన ఈ సినిమా శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ

హిమాలయాల్లో దాగున్న, ప్రపంచానికి అంతుచిక్కని 'నాగబంధం' రహస్యాన్ని ఆర్కియాలజీ పరిశోధకులు ప్రభాకర్ (జగపతిబాబు), అబ్దాలీ (రిషబ్ సాహ్నీ), టెస్లా అనే ముగ్గురు కనుగొంటారు. ఆ పురాతన గ్రంథంలోని రహస్యాల ద్వారా భారతదేశాన్ని సుసంపన్నమైన దేశంగా మార్చాలని ప్రభాకర్, టెస్లా భావిస్తారు. కానీ, స్వార్థపరుడైన అబ్దుల్లా (అబ్దాలీ) ఆ గ్రంథాన్ని చేజిక్కించుకోవడానికి టెస్లా కుటుంబాన్ని అంతం చేస్తాడు. నాగబంధాన్ని విముక్తి చేయాలంటే శ్రీరంగనాథ స్వామి నాభిలో ఉండే 'బ్రహ్మ కమలం' కావాలని తెలుసుకున్న అబ్దుల్లా, తన మనుషులతో దాన్ని దొంగిలిస్తాడు.

సినిమా ప్రపంచంలో పెను సంచలనం: బాహుబలి-3 వచ్చేస్తోంది..!
సినిమా ప్రపంచంలో పెను సంచలనం: బాహుబలి-3 వచ్చేస్తోంది..!
Nagabandham Movie Review amp amp Rating Abhishek Nama s Visual Devotional Wonder

ఆ బ్రహ్మ కమలం ఆచూకీ కనుక్కోవడానికి ఆ గూడెంలోని రుద్ర (విరాట్ కర్ణ)ను వాడుకోవాలని చూస్తాడు. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో, రుద్ర నాగసాధువుగా ఎలా మారాడు? హిందూ మతంపై, భారత్‌పై పాకిస్తాన్‌కు చెందిన ఒక వర్గం చేసిన కుట్రలను ఆ నాగసాధువు ఎలా భగ్నం చేశాడు? ఈ ప్రయాణంలో శ్రీరంగనాథుని పరమ భక్తురాలు పార్వతి (నభ నటేష్) పాత్ర ఏంటి? అనేదే ఈ చిత్ర ముఖ్యాంశం.

విశ్లేషణ

దర్శకుడిగా అభిషేక్ నామా ఎంచుకున్న పాయింట్, దాన్ని తెరపై చూపించిన విధానం అద్భుతం. ప్రతి ఫ్రేమ్‌లోనూ భారీతనం, టెక్నికల్ స్టాండర్డ్స్ స్పష్టంగా కనిపిస్తాయి. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ అందించిన విజువల్స్, అశోక్ ఆర్ట్ వర్క్ ప్రేక్షకులను ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ స్థాయిని తలపిస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్‌లో వచ్చే సనాతన ధర్మ పరిరక్షణ సీన్లు థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం. జునైద్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్లను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది.

ఇప్పుడొచ్చే ఓటీటీ థ్రిల్లర్స్ కు ఈ సినిమా తాత లాంటిది
ఇప్పుడొచ్చే ఓటీటీ థ్రిల్లర్స్ కు ఈ సినిమా తాత లాంటిది

నటీనటుల పెర్ఫార్మెన్స్

'పెదకాపు' సినిమాతో మెప్పించిన విరాట్ కర్ణ, ఈ చిత్రంలో పాత్రలో విశ్వరూపం చూపించాడు. ఒక సాధారణ గూడెం యువకుడిగా, ఆ తర్వాత పవర్‌ఫుల్ నాగసాధువుగా క్లిష్టమైన పాత్రను తన భుజాలపై మోసి మెప్పించాడు. పార్వతి పాత్రలో నభ నటేష్ అద్భుతమైన నటనను కనబరిచింది. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే కీలకమైన ట్విస్ట్‌ పాత్రలో ఒదిగిపోయింది. పాటల్లో ఆమె డాన్సులు హైలైట్‌గా నిలిచాయి. ప్రభాకర్‌గా జగపతిబాబు తన అనుభవంతో క్లాస్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగా, విలన్ అబ్దుల్లా పాత్రలో రిషబ్ సాహ్నీ క్రూరత్వాన్ని పండించి మెప్పించారు. అనసూయ భరద్వాజ్, దక్ష నగార్కర్, ఐశ్వర్య మీనన్ తమకు లభించిన తక్కువ నిడివిలోనే గుర్తుండిపోయే పాత్రల్లో రాణించారు.

ప్లస్ పాయింట్స్

తెలుగు స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడని విజువల్ వండర్.
సనాతన ధర్మం చుట్టూ అల్లిన కథ, ఫ్యామిలీ మరియు సిస్టర్ సెంటిమెంట్స్ బాగా పండాయి.
కనల్ కన్నన్ డిజైన్ చేసిన ఫైట్స్ మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయి.
ఊహించని మలుపులతో సాగే ఇంటర్వెల్ బ్యాంక్, క్లైమాక్స్ సినిమాకు పెద్ద అసెట్.

మైనస్ పాయింట్స్

చిన్నపాటి సాగతీత, పాటల ప్లేస్‌మెంట్స్ కథా గమనానికి కొద్దిగా బ్రేక్ వేసినప్పటికీ.. ఓవరాల్‌గా వచ్చే విజువల్ ఎక్స్‌పీరియన్స్ ముందు అవేవీ అడ్డుకావు.

ఫైనల్‌గా

"నాగబంధం" అనేది కేవలం ఒక సినిమా కాదు.. ఇదొక అద్భుతమైన విజువల్ డివైన్ జర్నీ. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికే కాకుండా, కుటుంబ సమేతంగా థియేటర్‌లో చూడదగ్గ క్లీన్ అండ్ గ్రాండ్ ఎంటర్టైనర్. ఈ వారాంతంలో ఖచ్చితంగా థియేటర్లలోనే ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన చిత్రమిది. డోంట్ మిస్ ఇట్.

రేటింగ్: 3/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+