ఉవ్వెత్తున ఎగిసిన బంగారం ధరలు: ఒక్కసారిగా బంపర్ రేట్
దేశీయంగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. అమెరికా ఉపాధి రంగ గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల చూపు సేఫ్ హెవెన్ పసిడి వైపు మళ్లింది. దీని ప్రభావంతో నేడు బంగారం ధరలు ఉవ్వెత్తిన ఎగిశాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర నూతన గరిష్టాలను తాకింది. 10 గ్రాములకు 1,47,000 రూపాయల మార్క్ వద్ద నిలిచింది. వెండి రేట్లు కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతున్నాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లోనూ బంగారం ఫ్యూచర్స్ ధరలు భారీగా పెరిగాయి. ఆగస్టు డెలివరీకి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ ఒప్పందాలు ఎంసీఎక్స్ లో 1.31 శాతం లాభంతో రూ. 1,47,668 వద్ద ముగిశాయి. బంగారంతో పాటు వెండి కూడా కొత్త రికార్డులను సృష్టించే దిశగా పయనిస్తోంది. జూలై డెలివరీకి సంబంధించిన సిల్వర్ ఫ్యూచర్స్ 1.63 శాతం మేర పెరిగి కిలో అత్యధికంగా రూ. 2,37,102 వద్ద ట్రేడయింది.

గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 1.4 శాతం పెరిగింది. దీనితో ఒక ఔన్సు బంగారం ధర 4,179.94 డాలర్లకు చేరింది. జూన్ 23 తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. అదే సమయంలో అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 1.6 శాతం పెరిగి 4,193.20 డాలర్ల మార్కును అధిగమించింది.
నేడు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,34,750, 24 క్యారెట్లు రూ. 1,47,490 ల వద్ద ట్రేడ్ అయింది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,34,750 పలకగా.. 24 క్యారెట్లు రూ. 1,47,380 వద్ద నిలిచింది. చెన్నైలో ఇదే ధర రూ. 1,34,750, రూ. 1,48,820లకు చేరింది. బెంగళూరులో 10 గ్రాముల బంగారం దర 22 క్యారెట్లకు రూ. 1,34,750 కాగా 24 క్యారెట్లు రూ. 1,47,528 ల వద్ద స్థిరపడింది. పుణెలో 22 క్యారెట్లు రూ. 1,34,750, 24 క్యారెట్లు రూ. 1,47,730 వద్ద స్థిరపడింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,956, 22 క్యారెట్లు - రూ. 13,700, 18 క్యారెట్లు - రూ. 11,440
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,700, 22 క్యారెట్లు- రూ. 13,476, 18 క్యారెట్లు - రూ. 11,025
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,700, 22 క్యారెట్లు- రూ. 13,476, 18 క్యారెట్లు - రూ. 11,025
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,700, 22 క్యారెట్లు- రూ. 13,476, 18 క్యారెట్లు - రూ. 11,025
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,700, 22 క్యారెట్లు- రూ. 13,476, 18 క్యారెట్లు - రూ. 11,025
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,700, 22 క్యారెట్లు- రూ. 13,476, 18 క్యారెట్లు - రూ. 11,025












Click it and Unblock the Notifications