ప్రతీకారం తీర్చుకుంటాంఃతాలిబన్లు
ఇస్లామాబాద్‌ః ఇస్లాంపై యుద్ధం ప్రకటించిన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా జరిపిన దాడుల్లో భారీ ఆస్తి నష్టంతో పాటు అమాయకుల ప్రాణాలు బలయ్యాయని తాలిబన్ నేతలు ప్రకటించారు. తాలిబన్ల సారధి సోమవారం నాడు క్యాబినెట్ సహచరులతో సమావేశమయ్యారు. అమెరికా దాడులను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
మరోవైపు ఇదే అదనుగా భావించిన నార్తరన్ అలయెన్స్‌సేనలు త్వరలో కాబూల్ తమ వశం అవుతుందని ప్రకటించాయి. జనావాసాల నుంచి వేలాది మంది ప్రజలను ఖాళీ చేయించినట్లు వారు చెప్పుకుంటున్నారు. మరోవైపు తాలిబన్ లను సమర్థించే వారిని నార్తరన్ అలయెన్స్ కు చెందినసేనలు టార్గెట్ గా ఎంచుకొని విధ్వంసం సృష్టిస్తున్నట్లు సమాచారంఅందింది. తాము అధికారం లోకి రావడం ఖాయమని అలయెన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నది.












Click it and Unblock the Notifications