యుద్ధ జ్వాలల్లోఅఎn్గాన్
కాబూల్‌ః అఎn్గాన్‌పై అమెరికా దాడులు ప్రారంభమయ్యాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభమై గురువారం వేకువజామున 4 గంటల వరకు నాలుగు విడతలుగా అఎn్గాన్‌లో కీలకప్రాంతాలపై అమెరికన్ వైమానిక దళం పెద్దఎత్తున విరుచుకుపడింది. కాబూల్, కాందహార్‌పై బాంబులు, క్షిపణుల వర్షం కురిసింది. శతఘ్నలతో తాలిబన్లు ప్రతిఘటనకు దిగినప్పటికీ దాడులు సమస్తం ఏకపక్షంగానేసాగాయి.
.
మరోవైపు అమెరికా దాని మిత్రపక్షాల పదాతి దళాలు సైతంఅఎn్గాన్ భూభాగంలోకి చొచ్చుకుపోతున్నాయి. న్యూయార్క్‌పై టెర్రరిస్టుల దాడి తర్వాత సరిగ్గా నెలరోజులకు అగ్రరాజ్యం అమెరికా ఎక్కుపెట్టిన ప్రతీకార దాడులతో గాంధారరాజ్యం అగ్నిగుండంగా మారింది.విమానాశ్రయాలు, సైనికస్థావరాలు, రేడియో స్టేషన్ భస్మీపటలం అయ్యాయి. భీకర శబ్దాలతో ఒక్కపెట్టున విరుచుకుపడిన అమెరికన్ యుద్ధవిమానాలో మోతకు బిక్కచచ్చినఅఎn్గాన్ పౌరులు వేల సంఖ్యలో ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని పరుగులు తీయడం ఆరంభించారు. అమెరికన్ బాంబర్లు కాబూల్, కాందహార్,జలాలాబాద్, మజారే షరీఫ్, హీరత్, తఖార్, కుందూస్‌తో పాటు పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి.అరేబియా సముద్రంలో మొహరించిన భారీ యుద్ధనౌకలు క్షిపణుల ప్రయోగంతో యుద్ధానికిశ్రీకారం చుట్టాయి. ప్రయోగించిన తొలి క్రూయిజ్ క్షిపణి కాబూల్‌లోని కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలింది.
ఆ తర్వాత వరసనే జరిగిన దాడులతో కాందహార్‌లోనిసెంట్రల్ కమాండ్ స్థావరం ధ్వంసమైంది. కాబూల్, కాందహార్‌తో పాటుజలాలాబాద్‌లోని మిలటరీ స్థావరాలు, తీవ్రవాదుల శిక్షణకేంద్రాలను ధ్వంసం చేశారు. అమెరికాతో పాటు దాడుల్లోబ్రిటన్ దళాలు కూడా పాల్గొంటున్నాయి. నాలుగు విడతల దాడుల్లో కనీసం వంద క్షిపణులను ప్రయోగించివుంటారనిఅంటున్నారు. సుమారు 50 యుద్ధవిమానాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి.
అమెరికా ప్రారంభించిన దాడులను ఆసరాగా తీసుకుని తాలిబన్ల బద్దశత్రుపక్షమైన నార్తర్న్ అలయెన్స్ కూడా విజృంభించింది. తాలిబన్ల పట్టు వున్న పలుకీలకప్రాంతాల్లోకి నార్తర్న్ అలయెన్స్ దూసుకుపోతున్నట్టుగా వార్తలుఅందాయి.












Click it and Unblock the Notifications