కృష్ణాజలాలలపై కేంద్రం ఉదాసీనం
న్యూఢిల్లీః అంతర్ రాష్ట్ర జలాలవివాదాన్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం తగు విధంగా చొరవ చూపడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కృష్ణానదీ జలాలను ఆంధ్రప్రదేశ్ ఒప్పందానికివిరుద్ధంగా వాడుకుంటున్నదని, ఒప్పందానికి అనుగుణంగా వ్యవహరించాల్సిందిగా కోరుతూ కర్ణాటక రాష్ట్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా సవాలు చేసింది.
నిబంధనలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటున్నదని ఆంధ్రప్రదేశ్ సర్కార్ సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఇరుపక్షాల వాదనలను జస్టిస్ పట్నాయక్ సారధ్యంలోని ఐదుగురు సభ్యులు బెంచ్ కేంద్ర అలసత్వంతో వ్యవహరిస్తున్నదనివిమర్శించారు. ఈ వ్యవహారాన్ని విస్తృత స్థాయి ధర్మాసనానికి నివేదించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.












Click it and Unblock the Notifications