పాక్‌కు మరింత సహాయం
వాషింగ్టన్: పాకిస్థాన్‌కు అమెరికా, ఐక్య రాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్‌ల నుంచి అదనపు సహాయంఅందుతుందని అమెరికా రక్షణ శాఖ సహాయ మంత్రి క్రిస్టినా రొక్కాచెప్పారు.
పాకిస్థాన్ 1979 నుంచి అఎn్ఘాన్ శరణార్థులకు సహాయంఅందించడంలో ఉదారత ప్రదర్శిస్తోందని ఆమె అన్నారు. ఉదారత వల్ల పాకిస్థాన్‌పై సామాజిక, ఆర్థిక భారం పడినవిషయాన్ని తాము గుర్తిస్తున్నామని, పెద్ద యెత్తున శరణార్థులు పాక్‌కు వెళ్లడం వల్ల న్యాయమైన రాజకీయ, భద్రతా సమస్యలు తల యెత్తుతున్నాయని ఆమె అన్నారు.
ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచానికి బేషరతు మద్దతు ప్రకటించినందున పాకిస్థాన్ ఆర్థిక, సామాజిక భారాన్ని తగ్గించేందుకు ఐక్యరాజ్య సమితి సంస్థలతో చర్చించి సహాయంఅందించనున్నట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications