కడపలో 50 మంది గల్లంతు

హైదరాబాద్‌ః రాష్ట్రంలో తాజా తుపాను నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి మంగళవారం నాడు ఉదయం నెల్లూరులో తీరం దాటినప్పటికీ దీని ప్రభావం వల్ల రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాలకు తోడుగా కడప జిల్లాలో వాగులు వంకలు పొంగి అధికారులు హెచ్చరికలు లేకుండా బుగ్గవంక ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్లు ఎత్తివేయడంతో ఒక్కపెట్టున కడప పట్టణాన్ని వరద నీరు ముంచెత్తింది. కనీసం 50 మంది గల్లంతయినట్టుగా వార్తలుఅందాయి. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఊళ్లో కనీసం పదడుగుల ఎత్తున నీరు నిలిచినట్టుగా చెబుతున్నారు.

కడపకు బయటప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వందలాది మంది వర్షంలోనే మేడలు,మిద్దెలు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. గల్లంతయిన వారంతా జలసమాధిఅయివుంటారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరులో రెండు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కడపలో మరో వెయ్యిమందిని తరలించారు. అనంతపురం జిల్లాలోని లోతట్టు గ్రామాలన్నీ జలమయమయ్యాయి. తుపాను తీవ్రత మరో 24 గంటలు వుండే అవకాశం వున్నదనిఅంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+