Tamil Nadu: విజయ్ ఎపిసోడ్ పై లోక్ భవన్ క్లారిటీ..! వారికే ఆహ్వానం.. !
తమిళనాడు (Tamil nadu) లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ లోక్ భవన్ (lok bhavan) ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. రాష్ట్రంలో విజయ్ పార్టీ టీవీకే , కాంగ్రెస్ కలిపి 112 మంది ఎమ్మెల్యేలే ఉన్న నేపథ్యంలో డీఎంకే-అన్నాడీఎంకే కూటములు కలిపి ప్రభుత్వ ఏర్పాటు చేస్తాయన్న ప్రచారం మొదలైంది. ఈ రెండు పార్టీలు కలిపి మెజార్టీ నిరూపించుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ లభిస్తుందన్న అంచనాల నేపథ్యంలో లోక్ భవన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం 118 మంది ఎమ్మెల్యేల మద్దతును ఏ పార్టీ అయితే చూపగలదో, ఆ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తామని లోక్ భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కేంద్రం ఒత్తిడితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను ఆ వర్గాలు ఖండించాయి. రాజ్యాంగ నిబంధనలకు కచ్చితంగా అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నాయి. డీఎంకే-అన్నాడీఎంకే దశాబ్దాల ఆధిపత్యాన్ని బ్రేక్ చేసి టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించాక కూడా విజయ్ ప్రమాణస్వీకారం ఆలస్యం చేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో లోక్ భవన్ ఈ క్లారిటీ ఇచ్చింది.

అందుకే స్టాలిన్ కు గుడ్ బై..! అసలు విషయం బయటపెట్టిన కాంగ్రెస్..!
ఇప్పటికే విజయ్ రెండుసార్లు గవర్నర్ అర్లేకర్ ను కలిసి తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరినా 118 సీట్లు లేకపోవడంతో ఛాన్స్ ఇవ్వలేమని వెనక్కి పంపారు. ఈ నేపథ్యంలో డీఎంకే-అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో విజయ్ కూడా అదే జరిగితే తమ 107 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తానని సంకేతాలు ఇచ్చారు. అయినా లోక్ భవన్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. అవసరమైతే రాష్ట్రపతి పాలనకు అయినా సిఫార్సు చేసేందుకు లోక్ భవన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications