'గోదారి గట్టుపైన' రివ్యూ.. సుమంత్ ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే..?

ఈ ఏడాది వేసవి బాక్సాఫీస్ వద్ద పెద్ద హీరోల సందడి లేక వెలవెలబోతోంది. ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకునేందుకు చిన్న చిత్రాలు క్యూ కడుతున్నాయి. 'మేమ్ ఫేమస్' చిత్రంతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా, గోదావరి నేపథ్యంతో వచ్చిన తాజా చిత్రం 'గోదారి గట్టుపైన'. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది? చూద్దాం!

కథ

రాజమండ్రి పరిసరాల్లో ఆటో నడుపుకుంటూ, కల్మషం లేని నవ్వుతో గడిపే కుర్రాడు రాజు (సుమంత్ ప్రభాస్). తన చెల్లెలితో పాటు ఇంజినీరింగ్ చదువుతున్న మాయ (నిధి ప్రదీప్) చూసి ఇష్టపడతాడు. మాయ తండ్రి శ్యాంబాబు (జగపతిబాబు) ఓ సెక్యూరిటీ గార్డ్. తన కూతురు అంటే ఆయనకు పంచప్రాణాలు. అయితే, తన కూతురిని తనకంటే ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేయాలనేది ఆయన ఆశయం.మరి ఓ సాదాసీదా ఆటోడ్రైవర్‌తో తన కూతురు ప్రేమలో పడిందని తెలిస్తే ఆ తండ్రి రియాక్షన్ ఏంటి? అసలు రాజు పోలీస్ స్టేషన్ మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? కులమతాల కంటే గొప్పదైన పెంపకం గురించి ఈ సినిమా ఏం చెప్పింది? అనేది మిగతా కథ.

Godari Gattupaina Movie Review amp amp Rating Sumanth Prabhas Shines in this Rural Drama

విశ్లేషణ

దర్శకుడు ఎంచుకున్న పల్లెటూరి నేపథ్యం సినిమాకు అతిపెద్ద బలం. గోదావరి గట్టు, పచ్చని పొలాలు, ఆ యాసలో ఉండే తీయదనం ప్రేక్షకులకు ఒక మంచి ఫీల్‌ను అందిస్తాయి. ప్రథమార్ధంలో హీరో, హీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్ క్యూట్‌గా ఉన్నప్పటికీ, కథనం నెమ్మదిగా సాగడం కాస్త అసహనానికి గురిచేస్తుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపించి, టీవీ సీరియల్స్‌ను గుర్తుకు తెస్తాయి.

మలుపులు తిరిగే ద్వితీయార్థం

సెకండాఫ్‌లో జగపతిబాబు పాత్రలోకి ప్రవేశించాక కథలో వేగం పెరుగుతుంది. ఆయన పాత్రను చూపించిన విధానం, చివర్లో వచ్చే ఎమోషనల్ పతాక సన్నివేశాలు సినిమాకు ప్రాణం పోశాయి. పిల్లలు తమ మనసులో మాటను తండ్రికి ధైర్యంగా చెప్పగలిగే వాతావరణం ఇంట్లో ఉండాలనే సందేశం నేటి తరానికి అవసరమైనది.

నటీనటుల పనితీరు

ఆటో డ్రైవర్ పాత్రలో సుమంత్ ప్రభాస్ ఒదిగిపోయాడు. డ్యాన్సులు, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. మాస్ లుక్‌లోనూ, ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించాడు.సహజమైన నటనతో నిధి ప్రదీప్ మెప్పించింది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. సినిమాకు పిల్లర్ లాంటి పాత్రజగపతిబాబుది. క్లైమాక్స్‌లో ఆయన నటన కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. సుదర్శన్ తన మార్క్ కామెడీతో అక్కడక్కడా నవ్వులు పూయించాడు. అయితే లైలా వంటి సీనియర్ నటిని సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది.

సాంకేతిక వర్గం

సంగీతం, విజువల్స్ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి. గోదావరి అందాలను కెమెరామెన్ అద్భుతంగా బంధించారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. కొన్ని అనవసరమైన సన్నివేశాలను కత్తిరిస్తే సినిమా ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ఉండేది.

ఫ్లస్ పాయింట్స్

సుమంత్ ప్రభాస్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్.
గోదావరి నేపథ్యం , ఆహ్లాదకరమైన విజువల్స్.
క్లైమాక్స్‌లో ఇచ్చే సామాజిక సందేశం.
అక్కడక్కడా పండిన హాస్యం.

మైనస్ పాయింట్స్

ఊహకు అందే పాత కథాంశం.
నెమ్మదిగా సాగే ప్రథమార్ధం.
కొన్ని సన్నివేశాల్లో సాగదీత.

బాటమ్ లైన్

'గోదారి గట్టుపైన' చిత్రం పక్కా గ్రామీణ ప్రేమకథ. కథలో కొత్తదనం లేకపోయినా, ఎమోషన్స్, పల్లెటూరి వాతావరణం కోసం ఒకసారి చూడొచ్చు. ఈ వీకెండ్‌లో భారీ యాక్షన్ సినిమాలు కాకుండా, ఒక కూల్ ఎమోషనల్ డ్రామా చూడాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్!

రేటింగ్: 3/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+