కదంబం
రియాద్‌ః ఒసామాబిన్ లాడెన్‌కు మద్దతు ఇచ్చే వారిపై కఠినంగా చర్యలు తీసుకోనున్నట్టుగా లాడెన్ మాతృదేశం సౌదీ అరేబియా ప్రకటించింది. లాడెన్‌కు మద్దతు ఇవ్వడం, సానుభూతి చూపడం సౌదీ జాతీయ ప్రయోజనాలకు ఏ మాత్రం క్షేమం కాదని ప్రభుత్వం పేర్కొంది.
లాడెన్ గణం దేశ ప్రతిష్టను కూడా నాశనం చేసినవిషయం దృష్టిలో వుంచుకోవాలని సౌదీ ప్రజలకు ప్రభుత్వం సూచించింది. సౌదీపరులైనప్పటికీ లాడెన్ వంటి వారికి మద్దతు నిచ్చేవారిని తాము బహిష్కరిస్తామని దేశీయ వ్యవహారాల మంత్రి ప్రిన్స్ నయీఫ్‌బిన్ అబ్దుల్ అజీజ్ చెప్పారు. లాడెన్ ఆయన వర్గీయులు దురదృష్టవశాత్తు ముస్లీంలుగా చలామణిలో వున్నా ఇస్లాంలో వారిలాండివారికి స్థానం లేదని ఆయన చెప్పారు. కుళ్లినఅంగాన్ని శస్త్ర చికిత్స చేసి తొలిగించకుంటే మొత్తం ప్రాణానికే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. లాడెన్ సౌదీ కుబేరుల కుటుంబానికి చెందిన వారన్నవిషయం విదితమే.












Click it and Unblock the Notifications