కదంబం
హైదరాబాద్‌ః తుపాను, వరదల కారణంగా వాటిల్లిన నష్టంపై అధికారులు అంచనాలు తయారు చేస్తున్నారని రెండు రోజుల్లో కేంద్రానికి సమగ్రమైన నివేదిక పంపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
గురువారం నాడు సచివాలయంలో వరద పరిస్థితిని, సహాయ చర్యలను ఆయన ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. వరదల తాకిడికిగురైన కడప, నెల్లూరు జిల్లాల్లో అధికార యంత్రాంగం వైఫల్యాన్నిఅంగీకరిస్తూ నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.కడపలో బుగ్గవంక ప్రాజెక్టునుంచి నెల్లూరులో సోమశిలనుంచి హెచ్చరించకుండా నీళ్లను వదలడాన్ని ముఖ్యమంత్రి తప్పుబట్టారు.
ఎక్కువ నష్టం నెల్లూరులో జరిగిందని ఆయన చెప్పారు. ధనిక,పేద బేధాలు లేకుండా బాధితులందరికీ బియ్యం, కిరోసిన్ ఉచిత పంపిణీకి ఆదేశించినట్టుగా ఆయన చెప్పారు. బాధితులందరికీ 24 గంటల్లో తాత్కాలిక పునరావాసం కల్పించాలని కూడా ఆదేశించినట్టు ఆయన తెలిపారు. సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాల్సిందిగా ఆయన కలెక్టర్లను ఆదేశించారు. నెల్లూరులో కనీసం 100 కోట్ల నష్టం జరిగివుంటుందనిఅంచనావేస్తున్నారు.
ఫార్మా సిటీ ప్లాన్ ఖరారు
హైదరాబాద్ శివార్లలోని మణికొండలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీకి సంబంధించిన పథకాన్ని ఖరారు చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి జరుగుతున్నకృషి, ఫలితాలపై ఇకపై ఏటా పత్రాన్ని విడుదల చేయాలని ముఖ్యమంత్రిఆదేశించారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రొత్సాహక మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశ్రామికపూరోగతిని ఆయన సమీక్షించారు.












Click it and Unblock the Notifications