అంత్రాక్స్ భయంతోసెనేట్‌కు గొళ్లెం
వాషింగ్టన్‌ః అంత్రాక్స్ భయంతో అమెరికా ప్రతినిధుల సభను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. సెనేట్‌లోని 31 మంది ఉద్యోగులకు అంత్రాక్స్ సోకినట్టు వెల్లడికావడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నది. ప్రాణాంతకమైన ఈ అంత్రాక్స్ బాక్టీరియాను సభాభవనం నుంచి సమూలంగా తుడిచిపెట్టడానికి వీలుగా మూసివేశారు.
సెనేట్, కాంగ్రెస్ రెండు సభలు వుండే కాపిటల్ భవనంలో అన్ని మూలలను ఈ బాక్టీరియా ఆనవాళ్లకోసం గాలిస్తున్నారు. న్యూయార్క్ గవర్నర్ కార్యాలయంలోని కొందరు ఉద్యోగులకు కూడా ఈ బాక్టీరియా సోకినట్టుగా వార్తలు రావడంతో అమెరికా ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా కలవరం చెందుతున్నది. అమెరికాతో పాటు యూరప్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు కూడాఅంత్రాక్స్ భయంతో కంపించిపోతున్నాయి.












Click it and Unblock the Notifications