కెన్యా చేతిలో భారత్ చిత్తు
పోర్ట్ ఎలిజబెత్: కెన్యాను తేలికగా తీసుకున్న భారత జట్టు భంగపడింది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఇక్కడ బుధవారం కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ఘోర పరాజయాన్ని చవి చూసింది. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ సమష్టి కృషితో సత్తా చూపిన కెన్యా భారత్‌పై 70 పరుగుల తేడాతోవిజయం సాధించింది. ఈ విజయం ద్వారా కెన్యా మూడు పాయింట్లు సాధించడమే కాకుండా భారత్‌ను 197 పరుగుల లోపే కట్టడి చేసినందుకు బోనస్ పాయింట్ సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన కెన్యా చక్కని బ్యాటింగ్ ప్రదర్శనను కనబరిచి నిర్ణీత 50 ఓవర్లలో ఆరువికెట్లు మాత్రమే కోల్పోయి 246 పరుగులు చేసింది. ఓపెనర్లు కెన్నడీ ఒటినో, రవీందు షా తొలివికెట్‌కు 121 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. ఆ తర్వాత థామస్ ఒడోయోస్టీవ్ టికోలోతో కలిసి మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించడం ద్వారా భారత్ ముందు మంచి లక్ష్యాన్నిపెట్టగలిగింది.
ఈ తర్వాత కెన్యా నిర్దేశించిన 247 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్‌కు దిగిన భారత్ కెన్యా బౌలర్ల చేతిలో కుప్ప కూలింది. భారత్ 46.4 ఓవర్లలో 176 పరుగులకే ఆలవుట్‌అయింది. సచిన్ (3), గంగూలీ (24), ద్రావిడ్ (11), యువరాజ్ సింగ్ (0), ఇలా భారతటాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కెన్యా బౌలింగ్‌కు వరుసగాపెవిలియన్ దారి పట్టారు. హర్బజన్ (37) కొద్దిసేపు నిలకడగా ఆడి కెన్యా విజయాన్ని కాస్తా ఆలస్యం చేయగలిగాడు.అంగారా, ఒడోయోలు మూడేసి వికెట్లు పడగొట్టగా, టోనీ సుజి రెండువికెట్లు తీసుకున్నాడు. ఆరంభంలోనే సచిన్‌ను అవుట్ చేసి కెన్యావిజయానికి దారి వేసిన అంగారాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.












Click it and Unblock the Notifications