వరదలకు తల్లడిల్లిన ఐదు జిల్లాలు

హైదరాబాద్‌: తుఫాను తాకిడికి 55 మంది మరణించారు. ఆస్తి నష్టం 500 కోట్ల రూపాయల వరకు వుంటుందనిఅంచనా. మొత్తం 166 చెరువులకు గండ్లు పడ్డాయి. 5,613 ఇళ్లు ధ్వంసమయ్యాయి. సహాయక శిబిరాల్లో 26 వేల మంది తలదాచుకుంటున్నారు. హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీళ్ల ప్యాకెట్లుఅందజేస్తున్నారు.
రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు, కోస్తా జిల్లా నెల్లూరు తుఫాను తాకిడికి తల్లడిల్లిపోయాయి. ఈ నాలుగు జిల్లాల ప్రజలను జలసర్పం కాటేసింది. తుఫాను బీభత్సానికి 35 మంది మాత్రమే మరణించారని అధికారులు చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య 55కుపైనే వుంటుందని అనధికారవర్గాల అంచనా.

మంగళవారం కురిసిన భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలో 16 మంది, కడప జిల్లాలో 30 మంది, చిత్తూరు జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇంకా దాదాపు 150 మంది జాడ తెలియడం లేదు. కడప జిల్లాబద్వేలు నియోజకవర్గంలోని అట్లూరు మండలంలో సుమారు 30 గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. 13 చెరువులు తెగి జలం ఈ గ్రామాలను చుట్టుముట్టింది. కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలోని సుగాలి మెట్ట దగ్గరి కొండలలో ఉన్న జంబులా పరమేశ్వరి దేవాలయానికి పూజల కోసం వెళ్లిన 20 మందిలో 15 మంది గల్లంతయ్యారు. తర్వాతవీరిలో ఆరుగురి శవాలు దొరికాయి. నెల్లూరు జిల్లాలోని గూడూరు నుంచి తిరుపతి, చెన్నై వెళ్లే రహదారుల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. బుధవారం సాయంత్రానికివీటిని పునరుద్ధరించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కడప, నెల్లూరు జిల్లాల్లో ఏరియల్‌సర్వే నిర్వహించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ తిరిగి వచ్చి వివిధ శాఖల అధికారులతో విస్తృత స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి వరదల పరిస్థితిని సమీక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+