వరద ఉధృతి తగ్గుముఖం
హైదరాబాద్: నెల్లూరు జిల్లాలోను, రాయలసీమ జిల్లాల్లోనూ పడుతోంది. దీంతో సహాయ చర్యలు ముమ్మరమయ్యాయి. నెల్లూరుజిల్లాతో పాటు రాయలసీమలోని కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలు తీవ్ర వరదలకుగురై జన జీవనం అస్త్యవస్థమైంది. ఈ వరదలకు ఐదు జిల్లాల్లో 55 మందికిపైగా మరణించారు. గల్లంతయినవారి సంఖ్య 150కిపైగా వుంది. వరద తాకిడి ప్రాంతాలు క్రమంగా కోలుకుంటున్నాయి. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. గురువారం ఆయన ఉన్నతాధికారుల సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. వరద ప్రాంతాల్లో సమాచార, రహదారి,విద్యుత్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. వీటి పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతంలోరైల్వే ట్రాక్, వంతెనల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.
ఇదిలా వుంటే, కర్నూలు జిల్లాలోని హంద్రీ నీవాకు వరదలు వచ్చే ప్రమాదం ఏర్పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితంగా ప్రాంతాలకు తరలిపోవాల్సిందిగా అధికార వర్గాలు హెచ్చరించాయి. కర్నూలు జిల్లాలోని కల్లూరు, కోడుమూరు మండలాల్లోని గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ముంచుకొచ్చింది. కర్నూలు జిల్లాలోని పాణ్యం సమీపంలోని ఒక గుడికి వెళ్లిన 20 మందిలో ఎనమండుగురి శవాలు లభ్యమయ్యాయి.మిగతావారి కోసం గాలిస్తున్నారు. నంద్యాల డివిజన్‌లో మున్సిపల్ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్, జిల్లా కలెక్టర్ సాయిప్రసాద్ పర్యటించారు.












Click it and Unblock the Notifications