గుంటూరులో వరదలుః14 మంది గల్లంతు
గుంటూరుః గుంటూరు జిల్లాలో మెరుపు వరదలకు 14 మంది గల్లంతయ్యారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం నూజెండ్ల మండలం తెల్లబాడులో జరిగింది.
గుండ్లకమ్మ వాగు హఠత్తుగా మహోధృతంగా ప్రవహించి దిగువ ప్రాంతంలో వున్న ఇళ్లను ముంచెత్తిందని అధికారులు చెప్పారు. పూర్తివివరాలు ఇంకా రాలేదు. ఒక్క మృతదేహం మాత్రం దిగువ ప్రాంతంలో లభించింది.మిగిలిన 13 మంది కోసం గాలిస్తున్నారు. రాయలసీమలో బీభత్సం సృష్టించిన తుఫాను, వరదలు కోస్తా జిల్లాలను మాత్రం తాకలేదని భావిస్తున్న తరుణంలో గుంటూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది.












Click it and Unblock the Notifications