ఫస్ట్ శాటర్‌డేచెస్ విజేత హంపి
హైదరాబాద్: ప్రపంచ మహిళల జూనియర్ చెస్ ఛాంపియన్ కోనేరు హంపి బుడాపెస్ట్‌లో బుధవారం ముగిసిన ఫస్ట్ శాటర్‌డే గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంటులో టైటిల్ సాధించింది. పిన్న వయస్సులోనే మహిళా గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన హంపి 11 రౌండ్ల పోరులో 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
చివరి రెండు రౌండ్లలో నెగ్గితే రెండో పురుషుల గ్రాండ్ మాస్టర్ నార్మ్ పొందే అవకాశం వుండగా హంపి రెండు డ్రాలతో సంతృప్తిచెందింది.మంగళవారం పదో రౌండ్‌లో నల్లపావులతో ఆడుతూ 47 ఎత్తుల్లో మాస్టర్ జాకబ్ అత్తిలా (హంగరీ)ని నిలువరించి హంపి ఆఖరి రౌండ్‌ను డ్రాగా ముగించింది. హంపి బెల్గ్రేడ్‌లో 20వ తేదీ నుంచి జరిగే టోర్నీలో రెండో నార్మ్ కోసం ప్రయత్నిస్తుంది.












Click it and Unblock the Notifications