కాశ్మీర్‌ కీలకమని అనలేదు : పావెల్‌

న్యూఢిల్లీ : ఉగ్రవాదంపై భారత్‌ జరుపుతున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు వుంటుందని అమెరికా విదేశాంగ మంత్రి కొలిన్‌ పావెల్‌ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్‌ సమస్యను రెండు జాతుల సిద్ధాంతం ఆధారంగా పరిష్కరించలేమన్న భారత్‌ వాదనను అమెరికా సమర్ధించింది. బుధవారం నాడు న్యూఢిల్లీలో భారత విదేశాంగ శాఖామంత్రి జశ్వంత్‌ సింగ్‌ కలిసి పావెల్‌విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కాశ్మీర్‌ అంశంపై తన పాకిస్తాన్‌ పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు ఆయనవివరణ ఇచ్చుకున్నారు. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాశ్మీర్‌ ప్రధానఅంశమని మాత్రమే తాను వ్యాఖ్యనించగా తన వ్యాఖ్యలను కీలకఅంశం అన్నట్టుగా అర్ధం చేసుకోవటం జరిగిందన్నారు.

తాను వెంటనే కాశ్మీర్‌ సమస్యను రెండు దేశాలూ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కూడా చెప్పానని ఆయన అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని సమూలంగా అంతం చేసేందుకు అమెరికా కట్టుబడి వున్నదని ఆయన అన్నారు. ఉగ్రవాద నిర్మూలనలక్ష్యంగా ప్రారంభించిన పోరాటం కేవలం ఆఫ్ఘనిస్తాన్‌కు మాత్రమే పరిమితం కాదని ఆయన స్పష్టం చేశారు.

భారత్‌ ఎదుర్కొంటున్నఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కూడా ఆమెరికా పోరాడుతుందన్నారు. కాశ్మీర్‌ ఉగ్రవాదాన్ని, ఆఫ్ఘన్‌ లో తాలిబన్‌లనుపెంచి పోషించిన పాకిస్తాన్‌ ఉగ్రదావంపై పోరాటంలో ఎలా సహకరిస్తుందని భావిస్తున్నారన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఉగ్రవాద సంస్ధ ఆల్‌ ఖయిదాను అణచివేసేందుకు ఉద్దేశించిన పోరాటంలో పాక్‌ పాల్గొనటం హర్షించదగ్గ పరిణామమన్నారు. తాలిబన్లఅసలు స్వరూపాన్ని పాక్‌ అర్ధం చేసుకున్నదన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఆల్‌ ఖయిదా నెట్‌ వర్క్‌ను అంతం చేసిన తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+