ఆర్టీసీ డిమాండ్లకు సిఎం తిరస్కారం

హైదరాబాద్‌ః ఆర్టీసీ ఉద్యోగుల ఆర్ధిక డిమాండ్లను ఆమోదించే సమస్యే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఆర్ధిక డిమాండ్లను పక్కనపెట్టి ఉద్యోగులు చర్చకు ముందుకువస్తే తాము చర్చలు జరుపుతామని ఆయన చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ డిమాండ్లను ఆమోదించాలంటే ప్రభుత్వం డబ్బులు కేటాయించాలని లేదంటే చార్జీలు పెంచాల్సివస్తుందని ఆయన చెప్పారు.

ఈ రెండింటిలో దేనికి కూడా తాము సిద్ధంగా లేమని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీని నష్టాల్లోంచి బయటకు తేవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కానీ కార్మికులే సహకరించడం లేదని ఆయనవిమర్శించారు. సమ్మె వల్ల ప్రయాణికులు ఎదుర్కుంటున్న ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నదని ఆయన చెప్పారు.

రాష్ట్రంలోని ప్రైవేట్‌ బస్సులసేవలను తీసుకోవడంతో పాటు ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా బస్సులను అద్దెకు తీసుకునే ప్రతిపాదన వున్నదని ఆయన వెల్లడించారు. ఇదిలా వుండగా సమ్మెను అణిచివేయడానికి ప్రభుత్వం అక్రమపద్దతుల్లో ప్రయత్నిస్తున్నదని 300 మందినిఅరెస్టు చేయడంతో పాటు 60 మందిని సస్పెండ్‌ చేశారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమ డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఆర్ధిక డిమాండ్లవిషయంలో ప్రభుత్వం చేస్తున్న వాదనలను వారు ఖండిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+