తాలిబన్లలో అంతర్యుద్ధం
న్యూఢిల్లీః తాలిబన్ సైనికుల మధ్య అంతర్యుద్ధం ప్రారంభమైంది. దక్షిణ అఎn్గాన్‌లో పుష్తూ, అరేబియా తెగలకు చెందిన మిలిటెంట్లు వీధి పోరాటాలు సాగిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒసామా బిన్ లాడెన్ అనుచర వర్గం ముల్లా ఒమర్‌కు వ్యతిరేకంగా నేరుగా ఘర్షణలకు దిగుతున్నట్టుగా ప్రవాసంలోని రబ్బనీ ప్రభుత్వం రాయబారి సయీద్ సర్ధార్ అహ్మదీ వెల్లడించారు.
ఈ అంతర్గత ఘర్షణకు కారణాలు ఏమిటన్నది మాత్రం తెలియరాలేదని చెప్పారు. తాలిబన్ల విదేశాంగమంత్రి ముత్తా వకీల్ ఫిరాయించినట్టుగా వచ్చిన వార్తలు ఇంకా ధృవపడలేదని అయితే ముత్తా వకీల్‌కు ముల్లా ఒమర్‌కు ఈ మధ్య సంబధాలు సరిగ్గా లేవని ఆయన చెప్పారు. నార్తర్న్ అలయెన్స్ దళాలు మజారే షరీఫ్‌కు సమీపంలోకి వచ్చాయనిపెద్దసంఖ్యలో తాలిబన్ సైనికులు వైరిపక్షంలోకి ఫిరాయిస్తున్నారని ఆయన వెల్లడించారు. బలవంతంగా తాలిబన్లలో కలిసినఅఎn్గాన్లు ఇప్పుడు ఫిరాయిస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications