అఎn్ఘాన్‌పై అమెరికా దాడులు ఉధృతి
కాబూల్: అమెరికా గురవారంనాడు కూడా కాబూల్‌పై వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో కాబూల్‌లోపెద్ద యెత్తున మంటలు లేచాయి. ఈ మంటలువిమానాశ్రయానికి అతి సమీపం వరకు పాకాయి. కాబూల్‌పై అమెరికా యుద్ధవిమానాలు ఎడ తెరిపి లేకుండా బాంబుల వర్షం కురిపించాయి. వైమానిక దాడులను మరింత ఉధృతం చేయాలని అమెరికా భావిస్తోంది.
అమెరికా జెట్లు గురువారం తెల్లవారుజామున నాలుగు బాంబులను కాబూల్‌కు ఆగ్నేయంలో ప్రయోగించాయి. ఈ ప్రాంతంలో తాలిబాన్ గగన తల రక్షణ బ్యాటరీలున్నాయి. ఆ తర్వాత మరో విడతవిమానాలు మూడు సార్లు కాబూల్‌లో బాంబుల వర్షం కురిపించాయి.
తాలిబాన్ ఆయుధ శక్తిని నిర్వీర్యం చేశామని పెంటగాన్ అధికార వర్గాలు చెప్పాయి. తాలిబాన్ నేత ముల్లా మహమ్మద్ ఒమర్, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ రక్షణ కవచాలను ఒక్కటొక్కటిగా ధ్వంసం చేస్తున్నామని ఆ వర్గాలన్నాయి. ఆల్ ఖయిదాను ఏ విధంగానూ రక్షించే వ్యవస్థను ఉండనివ్వమని ఆ వర్గాలు చెప్పాయి.












Click it and Unblock the Notifications