అధికార యంత్రాంగంపై జనాగ్రహం
నెల్లూరు, కడప : అధికారుల అలసత్వం వల్లే తాముసర్వం కోల్పోవాల్సి వచ్చిందని నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన వరద బాధితులు తీవ్ర ఆగ్రమం వ్యక్తం చేశారు. బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రెండు జిల్లాలలో పర్యటించిన సందర్భంగా వరద బాధితులు ఆయనను చుట్టుముట్టి తమ గోడువినిపించారు. బుధవారం ఉదయం కడప పట్టణానికి చేరుకున్న ముఖ్యమంత్రిని వరద బాధితులు దాదాపు ఐదు నిముషాల పాటుఅస్సలు మాట్లాడనీయలేదు. కడప పట్టణంలో ఆయన టాటాసుమోమీద పర్యటించి వరద పరిస్ధితి సమీక్షిస్తున్నప్పుడు ఎక్కడికక్కడ బాధితులు ఆయనను నిలదీశారు.
ఎలాంటి ముందు హెచ్చరికలు చేయకుండా ప్రాజెక్టు నీళ్లను వదిలివేయటంవల్లే తాము వరదలో చిక్కుకు పోయామని, తమను ఈ పరిస్ధితిలోకి నెట్టడమే కాకుండా 24 గంటలు గడిచినా తమకు ఎలాంటి సహాయాన్నీ అధికార యంత్రాంగం చేపట్టడం లేదని కడపలో బాధితులు ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేయగా ముఖ్యమంత్రిఅందుకు అంగీకరించారు. నెల్లూరు జిల్లా గూడూరులో కూడా ముఖ్యమంత్రికి ఇదే పరిస్ధితి ఎదురయ్యింది. అవసరం లేకున్నామినీ బైపాస్ రోడ్డు నిర్ణంచి దాన్ని ఇప్పటి వరకూ ప్రాంభించలేదని, చివరకు ఇప్పుడు దాని కారణంగానే తాము వరదలో చిక్కుకున్నామని బాధితులు ఆరోపించారు.ఇకపై బాధితులకు తక్షణ సహాయం అందేలా చూస్తానని, బాధ్యులైన అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వటంతో బాధితులు శాంతించారు.












Click it and Unblock the Notifications