రంగంలోకి దిగిన ప్రత్యేక దళాలు

కాబూల్‌ః నిర్విరామ దాడులతో తాలిబన్‌ సేనలను నిర్వీర్యం చేసిన అమెరికా ఇక భూతల పోరుకు శ్రీకారం చుట్టింది. అమెరికా నేత జార్జ్‌బుష్‌, బ్రిటన్‌ ప్రధాని టోనీ బ్లెయిర్‌ విడివిడిగా భూతల పోరు ప్రారంభం కానున్నట్టుగా ప్రకటించారు.

అనధికార వార్తల ప్రకారం ఇప్పటికే అమెరికా కమెండోలోఅఎn్గాన్‌ కొండల్లో దిగి ఆపరేషన్‌ ప్రారంభించినట్టుగా చెబుతున్నరు. గురువారం నాడు అమెరికా జరిపిన భయానకమైన దాడుల్లో కనీసం ఎనిమిది మంది పౌరులు మరణించినట్టుగా తాలిబన్లు వెల్లడించారు. గత రెండు రోజుల్లో అమెరికా వేసిన అనేక బాంబులు గురితప్పి జనవాసాలపై పడినట్టుగా తాలిబన్లు ఆరోపించారు.

అమెరికా మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నది.అఎn్గాన్‌లో అమెరికాకు తెలిసిన, అమెరికా గుర్తించగలిగిన దాదాపు తాలిబన్‌సైనిక స్థావరాలన్నీ ధ్వంసమైనట్టేనని చెబుతున్నారు. అల్‌ఖైదా నెట్‌వర్క్‌ను నామరూపాలు లేకుండా చేశామనిఅంటున్నారు. అఎn్గాన్‌ కొండల్లో దాక్కున్న వారిని కూడా బయటకు లాగి తుదముట్టిస్తే తమమిషన్‌ పూర్తవుతుందని అమెరికా చెబుతున్నది. అయితేపైకి మాత్రం అఎn్గాన్‌ యుద్ధ మరో రెండేళ్లు పట్టవచ్చని బుష్‌ ప్రకటించారు.అఎn్గాన్‌ భౌగోళిక ప్రాంతంలో తాలిబన్లను ఎదుర్కోవడం ఎంత కష్టమో అమెరికాకు కూడా బాగాతెలుసు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+